Prabhas - Pooja Hegde -Radhe Shyam -
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ జూలై 30 న విడుదలకు రెడీ అవుతోంది. అప్పటికి ఉత్తరాన ఉన్న కోవిడ్ పరిస్థితి మెరుగుపడకపోతే, సినిమా విడుదల వాయిదా పడే అవకాశం లేకపోలేదు. మరోవైపు, ఈ చిత్ర కథలో గీతాంజలి కోణం ఉందని వార్తలు వస్తున్నాయి. గీతాంజలి సినిమాలో హీరో హీరోయిన్ల ఇద్దరికీ ప్రాణాంతక రోగం ఉంటుంది.

రాధేశ్యామ్ హీరో మరియు హీరోయిన్ కూడా గీతాంజలి మాదిరిగా ప్రాణాంతక అనారోగ్యంతో బాధపడుతున్నారట. వారిద్దరిలో ఎవరు చనిపోతారు లేదా ఇద్దరూ మరణిస్తారా అనేది మాత్రం సినిమాలో సర్ ప్రైజ్ ఫ్యాక్టర్ ప్రస్తుతానికి అని అంటున్నారు. భారతీయ సినిమాలో మరణం ఎప్పుడూ సున్నితమైన విషయం.

తన రెండవ చిత్రం చేస్తున్న దర్శకుడు దానిని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రకు పూజా హెగ్డే పాత్ర చాలా ముఖ్యమైనదని అంటి అంటున్నారు. ఆమె పాత్ర ఒకానొక సమయంలో ప్రభాస్ క్యారెక్టర్ ని డామినెట్ చేస్తుందంట. ప్రభాస్ కు ఇప్పుడున్న సూపర్ స్టార్ డమ్ కు అది కూడా పెద్ద రిస్క్ అనే చెప్పుకోవాలి.

ఈ వార్త కు ప్రభాస్ అభిమానులలో ఇప్పుడు దడ దడ మొదలయ్యింది. ఈ సినిమా షూటింగ్ ప్రభాస్ ఇప్పటికే పూర్తి చేసి తన తదుపరి చిత్రాలు… సలార్, ఆదిపురుష్ సినిమాల షూటింగులకు షిఫ్ట్ అయిపోయాడు. ఆ సినిమాకో షెడ్యూల్ ఈ సినిమాకు ఒక షెడ్యూల్ అన్నట్టు హైదరాబాద్, ముంబైల మధ్య చక్కర్లు కొడుతున్నాడు.