tirumala tirupati devasthanamకలియుగ వైకుంఠం తిరుమల మరో సారి భక్తులకు దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది. కరోనా కారణంగా ఇప్పటికే మూడు నెలల పాటు భక్తులకు దర్శనం ఇవ్వని శ్రీనివాసుడు మరో సారి ఏకాంతంగానే సేవలు చేయించుకున్నాడా అనే సందేహాలు వేధిస్తున్నాయి. కరోనా వైరస్‌ తిరుమలలో రోజురోజుకు విజృంభిస్తోంది.

వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శ్రీవారి ఆలయ జీయర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 170 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. తిరుమలలో 18 మంది అర్చకులు, 100 మంది సెక్యురిటీ సిబ్బంది కరోనా బారిన పడ్డారు.

20 మంది పోటు సిబ్బంది, కల్యాణకట్టలో ఇద్దరికి కరోనా సోకినట్లు అధికారులు పేర్కొన్నారు. తిరుమలలో పరిస్థితులపై టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సమీక్ష నిర్వహించారు. దర్శనాలు ఆపడంపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోకపోయినా… దర్శనాలు ఆపడం తప్పకపోవచ్చని ఎప్పుడు అనేదే చూడాల్సి ఉందని సమాచారం.

ఇది ఇలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ లో కరోనా విళయతాండవం చేస్తుంది. రోజుకు దాదాపుగా 2500 కేసులు, నలభై మరణాలు సాధారణం అయిపోయాయి. ఇప్పటికే మొత్తం కేసులు నలభై వేలకు పైగా చేరాయి. ప్రభుత్వం కరోనా కంట్రోల్ కు ఎన్నో చర్యలు చేపడుతున్నాం అని చెబుతున్నా ఆ దిశగా ఫలితాలు కనిపించడం లేదు.