COVID-19 - cases in hyderabadసోమవారం రాత్రి విడుదల చేసిన తెలంగాణ కరోనా బుల్లెటిన్ ప్రకారం హైదరాబాద్ లో 510 కరోనా కేసులు మాత్రమే పాజిటివ్ గా నిర్దారణ అయ్యాయి. రంగారెడ్డి ,వరంగల్, కరంనగర్ వంటి చోట్ల కొద్దిగా పెరిగినట్లు ఉన్నా ,మొత్తం తెలంగాణ అంతటా కలిపి 1198 కేసులు వచ్చాయి. గడచిన 10-15 రోజులలో తెలంగాణలో కరోనా కేసులు 1000-1850 మధ్యలో ఉంటున్నాయి.

దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతూ ఉన్నా, తెలంగాణలో మాత్రం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో అయితే కేసులు తగ్గుతున్నాయి కూడా. అయితే కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరి కారణంగా ఎవరూ దీనిని నమ్మే స్థితిలో లేరు. తెలంగాణలో కరోనా పరీక్షలు తక్కువగా జరిగాయని, ప్రభుత్వతీరు బాగోలేదంటూ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది.

మొదటి నుండీ తెలంగాణ ప్రభుత్వం అంతా బాగానే ఉందని చెప్పే ప్రయత్నం చేస్తుంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో తొందరలో జీహెచ్ఎంసి ఎన్నికలు ఉండటంతో అంతా బానే ఉంది. ప్రభుత్వం సమర్ధవంతంగా పని చేస్తుందని చూపించుకోవడానికే తెలంగాణ ప్రభుత్వం ఆరాటపడుతుందని పలువురి ఆరోపణ.

అయితే వైరస్ ప్రభావం పెరిగితే పరిస్థితులు మొత్తానికి చెయ్యి దాటి పోయే ప్రమాదం ఉంది. రాజధానిలోని ఆసుపత్రులు ఆ పరిస్థితిని ఎదురుకోవడానికి సరిపోవు. ఇప్పటికే ఆ ఛాయలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. ఒకరకంగా కేసీఆర్ ప్రభుత్వం నిజంగానే నంబర్లను తగ్గించి చూపుతుంటే నిప్పుతో చెలగాటం ఆడుతున్నట్టే.