court-shock-to-jabardasth-teamబుల్లితెరపై వినోదాల విందు పంచుతూ సందడి చేసే ‘జబర్దస్త్’ షోపై విమర్శలు ఎన్ని వచ్చినా, దిగ్విజయంగా ఎపిసోడ్ లు కొనసాగుతున్నాయి. అలాగే ఎందరో కమెడియన్లను తెలుగు సినీ పరిశ్రమకు అందిస్తూ టాలీవుడ్ లో హల్చల్ చేస్తోంది. అయితే తాజాగా ఈ షో టీంపై కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది.

‘జబర్దస్త్’లో ప్రసారమైన ఒక ఎపిసోడ్ న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా ఉందంటూ న్యాయవాది అరుణ్ కుమార్ ఈ మేరకు ఒక పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు ‘జబర్దస్త్’ టీంకు నోటీసులు జారీ చేసింది. కాగా, ఈ కామెడీ షో పై గతంలో గౌడ విద్యార్థి సంఘం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కల్లుగీత కార్మికుల మనోభావాలు దెబ్బతినేలా ఉందంటూ నాడు గౌడ విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు.