ghazal srinivas coming out from jailలైంగిక విధింపుల ఆరోపణలు ఎదురుకుంటున్న గజల్ శ్రీనివాస్ మొత్తానికి జైలు నుండి బయటకు రాబోతున్నారు. నాంపల్లి కోర్టు ఆయనకు మొత్తనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇది షరతులతో కూడిన బెయిల్. ప్రతి బుధ,ఆదివారం పంజగుట్ట పోలీసు స్టేషనులో హాజరుకావాలని ఆదేశించింది కోర్టు.

మరోవైపు ఆయనకు బెయిల్‌ ఇవ్వవద్దంటూ పంజాగుట్ట పోలీసులు కౌంటర్‌ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసులో ఇంకా చాలామందిని విచారించాల్సి ఉందని, ఇప్పట్లో బెయిల్‌ దొరికితే సాక్ష్యాలు తారుమారు అవుతాయని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. అయితే కోర్టు గజల్ శ్రీనివాస్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది.

ఈ కేసులో రెండో నిందితురాలిగా ఉన్న పార్వతిని పరారీలో ఉన్నందున ఆమెను అరెస్టు చెయ్యలేదు పోలీసులు. మరోవైపు పార్వతి కూడా ముందస్తు బెయిల్‌ కోసం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. గజల్‌ బెయిల్‌తోపాటు పార్వతి ముందస్తు బెయిల్‌ కూడా కోర్టు మంజూరు చేసింది.