coronavirus vaccine will take at least 18 monthsకరోనా వైరస్ గజ గజ వణికిస్తోంది. చైనాలో పుట్టి.. ప్రపంచ దేశాలకు విస్తరించిన ఈ మహమ్మారి వేలాది మందిని బలి తీసుకుంది. తాజాగా.. భారత్‌లో కరోనా బాధితులు 74కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా లక్షా 25 వేల మందికి ఈ వైరస్ సోకింది. ఇప్పటివరకు దాదాపుగా 3,400 మంది దీని బారిన పడి ప్రపంచవ్యాప్తంగా చనిపోయారు.

భారత్ లో ఇప్పటివరకూ చావులు నమోదు కావడం ఊరట నిచ్చే విషయం. ఇది ఇలా ఉండగా నెల్లూరుకి చెందిన ఒక కుర్రాడికి ఇటలీ వెళ్లి వచ్చాకా కరోనా వైరస్ సోకింది. ఆంధ్రప్రదేశ్ లో ఇదే మొట్టమొదటి కరోనా వైరస్ కేసు. తెలంగాణాలో ఇప్పటికే ఈ వైరస్ బారిన పడిన యువకుడు కోలుకుంటున్నాడని సమాచారం. రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఇది ఇలా ఉండగా ఉష్ణోగ్రతలు పెరిగితే వైరస్ తీవ్రత తగ్గుతుందని శాస్త్రీయంగా రుజువు కాలేదని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి మీడియాకు చెప్పడం విశేషం. అదే ప్రకారంగా ప్రపంచంలోని టాప్ ఫార్మా కంపెనీలు ఈ వ్యాధికి వాక్సిన్ కనిపెట్టడానికి కనీసం 18 నెలలు పట్టే అవకాశం ఉందని అనడం అందరినీ కలవరపెడుతుంది.

18 నెలల కాలం అంటే ఈ లోగా పరిస్థితులు చెయ్యి దాటి పోతాయి. కరోనా ఎఫెక్ట్ కు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుదేలు అవుతున్నాయి. భారత్ లో ఒక్క రోజే భారత్ స్టాక్ ఎక్స్చేంజి 3000 పాయింట్లు, నిఫ్టీ 870 పాయింట్ల మేర నష్టపోయాయి. ఒక రోజులో ఇంత భారీ నష్టం నమోదు కావడం భారత మార్కెట్లలో ఇదే తొలి సారి కావడం విశేషం.