More-Theaters-To-Go-into-the-Hands-of-Syndicatesకరోనా కారణంగా సినిమా పరిశ్రమ పూర్తిగా కుదేల్ అయిపోయింది. షూటింగులు ఆగిపోయాయి. కొత్త సినిమాల విడుదలలు లేవు. రెండు నెలలుగా పరిశ్రమ ఎక్కడిది అక్కడ ఆగిపోయింది. పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి ఎప్పుడు వస్తాయి అనేది కూడా ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. పరిశ్రమలోని రోజు వారీ కూలీలను, కార్మికులను ఆదుకోవడానికి స్టార్లు తమ వంతు సమయం చేశారు.

అయితే థియేటర్ల మీద ఆధారపడిన వారికి మాత్రం ఎటువంటి సాయం అందలేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సింగిల్‌ స్ర్కీన్లు 1100-1200.. మల్టీప్లెక్లులు 500 ఉన్నాయి. వీటి మీద దాదాపుగా 35 వేల మంది ఆధారపడి బ్రతుకుతున్నారు. చాలాచోట్ల థియేటర్లలో మార్చి నెల జీతాలిచ్చినా, ఏప్రిల్‌ నుంచి సగం జీతాలే ఇస్తున్నారు.

తాత్కాలిక సిబ్బందికైతే అదీ లేదు. ఇక థియేటర్ల ఓనర్ల కైతే పరిస్థితి దారుణంగా ఉంది. జీతాలతో పాటు కరెంటు బిల్లులు కూడా చెల్లించాల్సిన పరిస్థితి. రెండు మూడు నెలలు ఇదే పరిస్థితి… చాలా మంది థియేటర్ల ఓనర్లు ఈ అప్పుల పాలై ఆస్తులు అమ్ముకోవాల్సి ఉంటుంది. లేకపోతే తమ థియేటర్లను కల్యాణ మండపాల కిందో లేక గోడౌన్ల కిందో మార్చుకోవాల్సి రావొచ్చు.

లేదు ఇక్కడే ఉండాలి అనుకుంటే… ఎవరో ఒక పెద్ద సిండికేట్ కు లీజుకు ఇచ్చుకోవాల్సిందే. ఈ సమయంలో లీజుకు ఇచ్చినా పెద్దగా వచ్చేది ఏమీ ఉండదు. తెలంగాణ ప్రభుత్వం చెప్పేదాని ప్రకారం ఆగస్టు లోపు షూటింగులు ప్రారంభం అయ్యే అవకాశం లేదు. అప్పటికి ఎన్ని కుటుంబాలు చితికి పోతాయో!