Coronavirus test in telanganaకరోనా వైరస్ పరీక్షలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బాగా వెనుకబడింది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ పది లక్షల టెస్టుల మార్క్ వైపు అడుగులు వేస్తుండగా, ఒక లక్ష పరీక్షలకు చేరుకోవడానికి రాష్ట్రం చాలా కష్టపడుతోంది. ఇప్పుడు ప్రైవేట్ ల్యాబ్లలో నిర్వహించిన పరీక్షలలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయని పేర్కొంటూ రాష్ట్రంలోని ప్రైవేట్ ల్యాబ్‌లలో పరీక్షను నిలిపివేసింది.

ఇటీవలే ప్రభుత్వం చేసిన తనిఖీలలో చాలా తేడాలు జరిగినట్టు గుర్తించారట. దానితో రాబోయే నాలుగు రోజులు ప్రైవేట్ ల్యాబ్స్‌లో పరీక్షలు ఉండవు. ల్యాబ్‌ల శానిటైజేషన్, ల్యాబ్ టెక్నీషియన్లందరికీ పరీక్షలు, టెస్టింగ్‌లో శిక్షణ ఈ సమయంలో జరుగుతాయి. ప్రైవేట్ ల్యాబ్స్ ప్రవేశంతో మాత్రమే తెలంగాణలో పరీక్షలు పెరిగారయి.

ఈ నిర్ణయంతో పరీక్షలలో రాష్ట్రం మరింత వెనకబడుతుంది. రాబోయే నాలుగు రోజులు, ప్రభుత్వ ప్రయోగశాలలు మరియు నమూనా సేకరణ కేంద్రాలలో మాత్రమే పరీక్షలు జరుగుతాయి. నిన్న రాత్రి ఇచ్చిన మెడికల్ బులెటిన్ ప్రకారం… మొట్టమొదటి సారిగా తెలంగాణాలో వెయ్యికు పైగా కేసులు నమోదు అయ్యాయి.

దీనితో మొత్తం కేసుల సంఖ్య 17,357కు చేరాయి. రాష్ట్రంలోని మొత్తం కేసులలో దాదాపుగా 76% కేసులు ఒక్క జీహెచ్ఎంసీ ఏరియాలోనివే. దాని బట్టి రాజధాని ప్రాంతం డేంజర్ లో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 247కు చేరింది.