Coronavirus - positvieభారత్ లో కరోనా కేసులు కోటి దాటాయి. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా లక్షా నలభై ఐదు వేల మంది మృత్యువాత పడ్డారు. వాక్సిన్ వచ్చే సూచనలు కనిపించడంతో ప్రజలు కొంచెం ఊపిరి పీల్చు కుంటున్నారు. అదీ కాకుండా సెప్టెంబర్ 15 నుండి కేసుల తీవ్రత దేశంలో తగ్గింది. ప్రస్తుతానికి రోజుకు 20,000-25,000 నమోదు అవుతున్నాయి.

అయితే వివిధ దేశాలను కుదిపేస్తున్న సెకండ్ వేవ్ ఇండియాలో ఉండకపోవచ్చని… ఉన్నా దాని తీవ్రత తక్కువే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దసరా, దీపావళి పండుగలొచ్చాయి.. ఓ రాష్ట్రంలో ఎన్నికలు కూడా జరిపారు. ఈ నేపథ్యంలో కేసులు పెరగకపోవడంతో ఇక అత్యంత తీవ్రదశ ముగిసినట్లే కనిపిస్తోంది.

హార్డ్ ఇమ్మ్యూనిటి అని చెప్పలేం కానీ ఎందుకనో తీవ్రత తగ్గింది. జనసంచారం ఎక్కువ ఉన్న చోట్లకు వెళ్ళకపోవడం, వెళ్లాల్సి వచ్చినప్పుడు మాస్కులు వాడటం, సామాజిక దూరం పాటించడం, రోగనిరోధక శక్తి పెంచుకోవడం ద్వారా వాక్సిన్ వచ్చే లోపు మనల్ని మనం కాపాడుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

“మళ్లీ తీవ్రత వస్తుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొద్దిస్థాయి రక్షణ లభించిందని భావించొచ్చు. అలాగని సమస్య తొలిగిపోయిందని అనుకోరాదు,” అని వారు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో వాక్సిన్ పంపిణీ మొదలయ్యింది. అమెరికాలో ఇప్పటివరకు ఇరవై లక్షల మందికి వాక్సిన్ వేశారు. అయితే భారత్ లో ఇప్పటివరకు ఏ వాక్సిన్ కు అనుమతి ఇవ్వలేదు.