Coronavirus-positive-cases-in-kadapaఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో కలకలం చోటుచేసుకుంది. నిన్న రాత్రి 9 గంటల నుండి నేటి ఉదయం 9 గంటల వరకూ జిల్లాలో పదిహేను కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అంతకు ముందు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఎక్కువ కేసులలో ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం తరువాతి స్థానములో ఉంది కడప.

గడచిన 12 గంటలలో ఏపీలో 43 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో దాదాపు అన్ని కేసులు ఢిల్లీకి సంబంధించిన ఇస్లాం మీటింగ్ కు సంబంధించినవే. అదే విధంగా ఏపీలో నమోదైన చివరి కేసులలో దాదాపుగా 70 కేసులు ఈ మీటింగ్ కు సంబంధించినవే. ఇంకా ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఆ మీటింగ్ కు వెళ్లిన వారు దాదాపుగా 1000 మంది ఉండవచ్చు అంటున్నారు.

ఇందులో చాలా మంది ఇప్పటికీ ప్రభుత్వం గుర్తించలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణకు చాలా దగ్గరలో ఉంది. దేశవ్యాప్తంగా, మొత్తం కేసుల సంఖ్య 1700 కన్నా ఎక్కువ. గత 48 గంటల్లో పెరుగుదల ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా మెజారిటీ కేసులు ఢిల్లీకి సంబంధించినవే.

ఈ పరిస్థితిని పరిశీలిస్తే, ఇంతకుముందు అనుకున్న మూడు వారాలకు మించి భారత్ లాక్డౌన్ విస్తరించవచ్చు. దీనితో భారత్ ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు వాటి ఉద్యోగులకు పాక్షికంగానే జీతాలు చెల్లిస్తున్నాయి.