Research-About-The-US-Says-No-To-India's-Plan-to-Lift-The-Lockdownకేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ లెక్కల ప్రకారం… భారత్ లో ఇప్పటివరకూ 15,712 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. అయితే లో కరోనా కేసులు రెట్టింపయ్యేందుకు పడుతోన్న సమయం పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. ఇది ముమ్మాటికీ శుభసంకేతమని చెప్పుకొచ్చారు ఆయన.

గడచిన 14 రోజుల్లో కరోనా కేసులు రెట్టింపయ్యేందుకు 6.2 రోజులు పట్టేదని, గడచిన వారంలో దీనికి 7.2 రోజుల సమయం పట్టిందన్నారు. గడచిన మూడు రోజుల్లో కరోనా కేసులు రెట్టింపయ్యేందుకు 9.7 రోజులు పడుతోందని చెప్పారు. ఇప్పటివరకు కట్టుదిట్టంగా అమలు చేసిన లొక్డౌన్ కారణంగానే ఇది సాధ్యమైంది.

అయితే ఈ తరుణంలో దేశంలోని చాలా ప్రాంతాలలో రేపటి నుండి లొక్డౌన్ ని పాక్షికంగా సడలిస్తున్నారు. ఇది ఎటువంటి పరిణామానికి దారి తీస్తుందో అని అంతా చింతిస్తున్నారు. మే 3 వరకు ఇప్పుడు ఉన్నట్టే కఠినంగా లొక్డౌన్ అమలు చేస్తే ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు వచ్చేవని నిపుణుల భావన.

కాకపోతే ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం సడలింపు ఇవ్వక తప్పలేదు. గ్రామీణ ఆర్థిక, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు, వస్తు రవాణాకు ఊతమిచ్చేలా కేంద్రం పలు మినహాయింపులు ఇచ్చింది. ఇవన్నీ ఈనెల 20వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. అయితే నాన్ – హాట్ స్పాట్ ప్రాంతాలలో మాత్రమే ఇవి అమలు అవుతాయి.