coronavirus lockdown  effect Alcohol Addiction కరోనా వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో కేవలం నిత్యావసరాలకు సంబంధించిన షాప్‌లు తప్ప మిగతా షాప్‌లు మూత పడ్డాయి. వైన్‌ షాప్‌లు కూడా మూతపడటంతో మందుబాబులు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురుకుంటున్నారు.

రోజు మద్యం సేవించడం అలవాటు ఉన్నవారికి ఒక్కసారిగా మందు దొరక్కపోవడంతో తట్టుకోలేకపోతున్నారు. మద్యానికి బానిసైన ఒక్కరిద్దరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కొందరు చాలా వింతగా ప్రవరిస్తున్నారు. దీంతో ఆందోళనకు గురైన మందుబాబుల కుటుంబసభ్యులు.. వారిని ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తీసుకువస్తున్నారు.

దీంతో ఎర్రగడ్డ ఆస్పత్రికి రోజురోజుకు మందుబాబులు రాక పెరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ వంకతో మద్యం దుకాణాలు తెరిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నాయి. లాక్ డౌన్ వల్ల ప్రభుత్వ రాబడి పడిపోయి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయి. మద్యం దుకాణాలు తెరిస్తే కొంత ఆదాయం లభించే అవకాశం ఉంది.

అయితే దీనివల్ల రాజకీయ విమర్శలు రావొచ్చు. మద్యం అంటే పడని ప్రజలు తమకు నిత్యావసరాలకు ఇబ్బందిగా ఉంటే ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తుందా? అని కూడా అంటారు. ఏపీలో మద్యం వ్యాపారం ప్రభుత్వమే నిర్వహించడంతో మరిన్ని విమర్శలు రావొచ్చు. దీనితో ఏం చెయ్యాలా అని ప్రభుత్వాలు ఆలోచనలో పడ్డాయి. లాక్ డౌన్ పెంచితే మాత్రం మద్యం అమ్మకాలు మొదలు కావడం ఖాయం అంటున్నారు.