Coronavirus Scare To Postpone IPL?ప్రపంచాన్ని అంతటినీ వణికిస్తున్న కరోనా ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణకు అడ్డంకిగా మారింది. మార్చి 29న మొదలవ్వాల్సిన టోర్నమెంట్ ఆగిపోయింది. భారత్ లో లాక్ డౌన్ ఈ నెలాఖరు వరకూ పొడిగించడంతో అసలు ఐపీఎల్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఓ మీడియా సమావేశంలో ఈ విషయం పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. ఐపీఎల్ జరుగుతుందా అని ప్రశ్నించినందుకు… అసలు ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లో ఉంటె ఐపీఎల్ నిర్వహించేందుకు ఎక్కడ సానుకూల పరిస్థితులు లేవు అని తెలియజేసాడు. ఈ విషయం పై బీసీసీఐ అధికారులతో చర్చించి రేపు సోమవారం ఐపీఎల్ పై క్లారిటీ ఇస్తాం అని చెప్పాడు.

ఐపీఎల్ రద్దయితే.. సుమారు రూ. 3వేల కోట్లు బీసీసీఐ నష్టపోనుందని తెలుస్తోంది. ఆటగాళ్లు కూడా చాలా నష్టపోతారు. దీంతో.. సెప్టెంబరు- అక్టోబరులో టోర్నీ నిర్వహణకి అనువైన మార్గాల్ని బీసీసీఐ ప్రస్తుతం పరిశీలిస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే అది కూడా అంత తేలికేమీ కాదు.

ఒక దశలో ఆడియన్స్ లేకుండా ఈ మ్యాచ్లను ఆడాలని అనుకున్నా, విదేశీ ఆటగాళ్లకు వీసాలు వచ్చే అవకాశం లేకపోవడంతో అది కూడా కుదరలేదు. ఇది ఇలా ఉండగా… మన దేశం లో ఇప్పటివరకు 8,356‬ కరోనా కేసులు నమోదుకాగా 273 మంది మరణించారు. రోజురోజుకు కేసులు సంఖ్య పెరగడంతో ఇప్పట్లో పరిస్థితులు అనుకూలించే అవకాశాలు లేవు.