Are Indian Filmmakers Exploiting OTT Platforms?రానున్న కొన్ని నెలల పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు కఠినంగా ఉండబోతుంది. కరోనా కారణంగా పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదురుకుంటుంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ప్రాజెక్టుల పై చాలా అనిశ్చితి ఉంది, అలాగే సాధారణ స్థితి పునరుద్ధరించబడే వరకు కొత్త ప్రాజెక్టులు ఆలస్యం కావచ్చు.

ఈ సమయంలో ఖాళీగా ఉండకుండా.. యువ దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపుడి, హరీష్ శంకర్, మరియు ఇతర దర్శకులు టెంపరరీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వారు డిజిటల్ రంగంలోకి ప్రవేశించడానికి ప్రణాళికలు వేస్తున్నారు. అల్లు అరవింద్ కు చెందిన ఆహా యాప్ సృజనాత్మక విభాగాన్ని పర్యవేక్షించడానికి వంశీ పైడిపల్లి ఇప్పటికే రంగంలోకి దిగారు.

హరీష్ శంకర్ మరియు అనిల్ రావిపుడి తమ బ్యానర్‌లలో వెబ్ సిరీస్‌ను రూపొందించే పనిని ప్రారంభించారు. వారు తమ దగ్గర పని చేసిన సహాయకులు మరియు రచయితల ఆలోచనలను వింటున్నారు. అవసరమైతే ఆయా ప్రాజెక్టులకు వారు దర్శకత్వ పర్యవేక్షణ చేసి హైప్ తెస్తారట.

వారు తమ తదుపరి సినిమాలు ప్రారంభించడానికి ముందు ఈ ప్రాజెక్టుల నుండి మంచి డబ్బు సంపాదించాలని ఆశిస్తున్నారు. వంశీ పైడిపల్లి మహేష్ బాబు కోసం, హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కోసం, అనిల్ రావిపూడి వెంకటేష్.. వరుణ్ తేజ్ల కోసం వెచ్చిచూస్తున్నారు. ఇందులో వంశీ ప్రాజెక్టు తప్ప మిగతావి కాంఫర్మే.