Lockdown-hyderabad
హైదరాబాద్‌లో కొరోనా వైరస్ ప్రమాదం రోజురోజుకు పెరుగుతోంది. తెలంగాణ రాజధాని నగరమైనహైదరాబాద్ లో ఇప్పటివరకు 399 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 20 మంది మరణించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులలో ఇది 40-45%. వెస్ట్ జోన్ మరియు సౌత్ జోన్లలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

వెస్ట్ జోన్ -138, సౌత్ జోన్ -170, సెంట్రల్ జోన్ -45, ఈస్ట్ జోన్ కేసుల సంఖ్య 33గా ఉంది. ఇది ఇలా ఉండగా… తెలంగాణలో, గత రాత్రి విడుదల చేసిన మెడికల్ బులెటిన్ ప్రకారం, మొత్తం కేసులు 872 కి పెరిగాయి, వాటిలో 663 యాక్టీవ్ కేసులు. కేసుల్లో ఎక్కువ భాగం నిజాముద్దీన్ మర్కజ్ ఈవెంట్‌ కు సంబంధించినవి.

ఇది ఇలా ఉండగా… మే 7 వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి లాక్డౌన్ ప్రకటించినట్లు మన పాఠకులకు తెలుసు. దేశవ్యాప్తంగా మే 3వరకే లొక్డౌన్ విధించగా… తెలంగాణాలో మే 7 వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. హాట్‌స్పాట్ కాని ప్రాంతాలకు సైతం మినహాయింపులు ఇవ్వడానికి కూడా రాష్ట్రం నిరాకరించింది.

కరోనా కంట్రోల్ కోసం తెలంగాణ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకున్నా పరిస్థితి తీవ్రంగానే ఉంది. ఇప్పటివరకూ కరోనా కేసులన్నీ గాంధీ ఆసుపత్రిలో ట్రీట్ చేస్తుండగా… అత్యవసర పరిస్థితి కోసం గచ్చిబౌలిలో 1500 పడకల తాత్కాలిక ఆసుపత్రిని కూడా సిద్ధం చేసింది కేసీఆర్ ప్రభుత్వం.