Coronavirus cases spikes in andhra pradesh districtsఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఎక్కడా తగ్గుముఖం పట్టే అవకాశం కనిపించడం లేదు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 73 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలోని మొత్తం కేసులు 1,332కు చేరాయి. కొత్తగా నమోదైన కేసులలో 29 కేసులు గుంటూరు జిల్లాకు చెందినవి, మరో 13 కృష్ణా జిల్లాకు చెందినవి, 11 కేసులు కర్నూల్ కు చెందినవి.

ఎక్కువ కేసులు ఉన్న జిల్లాలలో మొదటి స్థానాల్లో 343 కేసులతో కర్నూలు, 283 కేసులతో గుంటూరు ఉన్నాయి. 236 కేసులతో ఉన్న కృష్ణా పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. ఈ జిల్లాల్లో పరిస్థితులు తీవ్రంగా ఉండాలని, తక్షణ జోక్యం అవసరం. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు లేని ఏకైక జిల్లా విజయనగరం.

అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో ఐదు కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ లో 31 మంది మరణించారు మరియు 287 మంది డిశ్చార్జ్ కావడంతో 1,014 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇక కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 31,332.

అలాగే ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య వెయ్యి దాటింది. ప్రస్తుతం మృతుల సంఖ్య 1007గా ఉంది. దీనితో మే 3 తో పూర్తయ్యే లాక్ డౌన్ విషయంలో కేంద్రం ఏం చెయ్యబోతుంది అనేది చూడాల్సి ఉంది. ప్రభుత్వం నుండి అందుతున్న సంకేతాలను బట్టి గ్రీన్ జోన్లలో సడలింపు ఇచ్చే అవకాశం ఉంది.