coronavirus cases recovery in telangana తెలంగాణలో కరోనా రోగుల విషయంలో సరైన ఇన్ఫర్మేషన్ ఉండటం లేదు. ఇది వరకు రోజుకు రెండు బులెటిన్లు విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఒక్క బులెటిన్ మాత్రమే విడుదల చేస్తుంది. పైగా అందులో రోగులు ఎక్కడి వారు, ఎక్కడకి వెళ్లారు అనే డీటెయిల్స్ ఉండటం లేదు. చివరిగా వచ్చిన అప్డేట్ ప్రకారం రాష్ట్రంలో 97 కేసులు ఉన్నాయి.

ఇందులో ఇప్పటికే 13 మంది రికవర్ అయ్యి డీఛార్జ్ అయ్యారు. ఈరోజు చేసిన పరీక్షలలో మరో పది మందికి నెగటివ్ వచ్చిందని, వారి సాంపిల్స్ పూణే లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీ కి పంపామని ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర మీడియాకు తెలిపారు. అందులోనూ నెగటివ్ వస్తే వారిని డిశ్చార్జ్ చేస్తామని ప్రకటించారు.

డిశ్చార్జ్ అయినవారు 14 రోజుల పాటు హోంక్వారంటైన్ లో ఉంటారు. ఇప్పటి వరకు కరోనాతో రాష్ట్రంలో ఆరుగురు మృతిచెందారు. ఇది ఇలా ఉండగా… తెలంగాణ నుంచి 1000 మందికి పైగా దిల్లీలోని మర్కజ్ కు వెళ్లారని ఈటల రాజేందర్ తెలిపారు. వీరిలో 160 మంది మినహా అందరినీ గుర్తించామని చెప్పారు.

దిల్లీలోని మార్కజ్ గురించి ముందుగా కేంద్రానికి తామే చెప్పామని ఈటల పేర్కొన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు లాక్ డౌన్ ప్రకటించింది తెలంగాణే అని గుర్తు చేశారు. ఇది ఇలా ఉండగా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ లో నిన్న రాత్రి నుండి ఈరోజు ఉదయం వరకు 43 కేసులు నమోదు అయ్యాయి. అక్కడి మొత్తం కేసులు 87కు చేరాయి.