Coronavirus cases increase andhra pradesh and telangana24 గంటలలో కరోనా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల గాలి తీసేసింది. కరోనా నా మాజాకానా అనిపించేలా చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుకు ఇప్పటివరకూ ఈ విపత్తుని హేండిల్ చెయ్యడంలో చాలా మంచి పేరు వచ్చింది. వలస కార్మికుల గురించి ఆయన చెప్పిన మాటలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

ఈ ఊపులో కేసీఆర్ ఏప్రిల్ 7 తరువాత తెలంగాణాలో కరోనా లేకుండా చేస్తాం అని ప్రకటించేశారు. అయితే అలా చెప్పిన 24 గంటలలోనే తెలంగాణాలో ఆరు కరోనా మరణాలు నమోదు అయ్యాయి. అన్నీ ఢిల్లీలో జరిగిన ఇస్లాం మత ప్రచార సభకు సంబంధించినవే. అయితే తెలంగాణాలో నమోదైన కేసుల వారు ఎవరూ ప్రాణాపాయ స్థితిలో లేరని సీఎం అంతకుముందే చెప్పడం గమనార్హం.

నమోదైన కేసులలో ఎక్కువగా ముస్లింలు, వారంతా ఢిల్లీ వెళ్లి వచ్చినవారే అయినా ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేకపోయింది అనే చర్చ జరుగుతుంది. తాజాగా రాష్ట్రం నుండి దాదాపుగా 400 మంది ఆ కార్యక్రమానికి వెళ్ళినట్టు సమాచారం. దీనితో కేసీఆర్ కు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది.

ఇక మరో తెలుగు సీఎం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటివరకు కేసీఆర్ స్పీడ్ ని అందుకోలేకపోయారు. అయితే వాలంటీర్ల వ్యవస్థ గురించి అధికార పార్టీ వారు అంతా ఇంతా కాదని ప్రచారం చేసుకుంటున్నారు. వాలంటీర్ల వల్లే రాష్ట్రంలో తక్కువ కేసులు నమోదు అవుతున్నాయని గొప్పగా చెప్పుకున్నారు.

అయితే నిన్న రాత్రి నుండి ఈరోజు ఉదయం వరకూ ఏపీలో ఏకంగా 11 కేసులు నమోదు అయ్యాయి. అన్నీ ఈ మత ప్రచార సభకు చెందినవే. వాలంటీర్లు ఇంటింటికీ తిరిగితే ఢిల్లీ వెళ్లిన వారిని ఎందుకు గుర్తించలేకపోయారు అని అందరు వాలంటీర్ల వ్యవస్థని ఎద్దేవా చేస్తున్నారు. పైగా వీరి చేత ఒక హెల్త్ సర్వే కూడా చేయించింది ఏపీ ప్రభుత్వం. దీనితో కరోనా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల గాలి తీసేసిందని చెప్పుకోవచ్చు.