Coronavirus cases in andhra pradesh increasesఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈ మధ్య కాలంలో మొదటి సారిగా 40కి తక్కువగా నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 38 కొత్త కేసులు నమోదయ్యాయి, మొత్తం 2,018 కు చేరుకుంది. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కటి తొమ్మిది కేసులు నమోదయ్యాయి. అనంతపురంలో ఎనిమిది కేసులు నమోదయ్యాయి.

అత్యధిక కేసులలో మొదటి రెండు స్థానాలలో 575 కేసులతో కర్నూలు, 387 కేసులతో గుంటూరు ఉన్నాయి. 342 కేసులతో కృష్ణా జిల్లా పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. ఈ మూడు జిల్లాలు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసులలో 66% ఉన్నాయి. 45 మంది మరణించడం, మరియు 998 మంది డిశ్చార్జ్ కావడంతో, 975 క్రియాశీల కేసులు ఉన్నాయి.

ఇది ఇలా ఉండగా… ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 67,152. నిన్న ఒక్క రోజే దేశంలో అత్యధికంగా 4,200 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో సగానికి పైగా కేసులు మహారాష్ట్రలోనే నమోదు అయ్యాయి. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన నాటి నుండి కేసులు పెరగడం గమనార్హం.

అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని సడలింపులు ఇస్తూనే ఉన్నాయి. తాజాగా రైలు సర్వీసులు పునరుద్దించే దిశగా మొదటి దశలో 15 రూట్లలో రైళ్లు నడుపుతుంది. మూడవ దశ లాక్ డౌన్ ఈ నెల 17తో పూర్తి కావడంతో లాక్ డౌన్ ఎత్తివేస్తారా అనే చర్చ జరుగుతుంది.