coronavirus-andhra-pradesh-schoolsప్రతిపక్షాల నుండీ పౌరసమాజం నుండీ తీవ్ర ప్రతిఘటన ఎదురైనా మొండిగా పాఠశాలలో తీర్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. దానికి గట్టి మూలయమే చెలించుకోవాల్సి వస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పాఠశాలలే కరోనా క్లస్టర్లుగా మారుతున్నాయని సమాచారం. ప్రకాశం జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో కరోనా కేసులు వెలుగు చూడటమే ఇందుకు నిదర్శనం.

జిల్లా వ్యాప్తంగా 4 జడ్పీ హైస్కూళ్లలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా సోకింది. జరుగుమల్లి మండలం పచ్చవలో ఇద్దరు విద్యార్థులు, ఓ ఉపాధ్యాయురాలికి కరోనా నిర్ధారణ అయ్యింది. త్రిపురాంతకం హైస్కూల్‌లో ఉపాధ్యాయుడికి వైరస్‌ సోకింది. పి.సి.పల్లిలోని హైస్కూల్లో విద్యార్థి, ఉపాధ్యాయుడికి, పెద్దగొల్లపల్లి హైస్కూల్‌లో మరో ఉపాధ్యాయుడికి కరోనా సోకింది.

ఒక్కసారిగా కరోనా కేసులు నమోదవుతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి విద్యార్థులు, టీచర్ల హాజరు, కరోనా కేసుల వివరాలు రోజువారీ సేకరిస్తున్నారు. అయితే దీని ప్రభావం వల్ల హాజరు కూడా క్రమేపీ తగ్గుతుందని సమాచారం.

మిగిలిన జిల్లాలలో కూడా ఇటువంటి పరిస్థితే ఉందని అయితే ప్రభుత్వం బయటకు రానియ్యడం లేదని కొన్ని మీడియా కథనాలు కూడా వస్తున్నాయి. మరోవైపు… ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ప్రైవేటు స్కూళ్ళు మాత్రమే బడులు తెరిచే సాహసం చెయ్యడం లేదు. కరోనా కేసులు పెరిగితే ప్రభుత్వంలా తాము బాధ్యత నుండి తప్పించుకోలేమని అందుకే ఆన్ లైన్ క్లాసులకే తమ ఓటు అని పాఠశాలల మానేజ్మెంట్లు అంటున్నాయి.