connections between TV9 Ravi Prakash - Hero Sivajiఫోర‍్జరీతో పాటు, నిధుల మళ్లింపుకు పాల్పడి టీవీ9 టీవీ ఛానల్ నుంచి ఉద్వాసనకు గురైన సీనియర్ జర్నలిస్టు రవిప్రకాష్ అజ్ఞాతంలో ఉన్నారు. ఆయనతో పాటు నటుడు శివాజీ కూడా ఈ కేసులో ఇరుకున్నట్టు సమాచారం. నటుడు శివాజీ నివాసంలోనూ పోలీసులు సోదాలు జరుపుతున్నారు. నారాయణగూడ, హిమాయత్‌ నగర్‌లోని ఆయన నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. శివాజీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

సంస్థకు హాని కలిగించే దురుద్దేశంతో శివాజీతో దురుద్దేశ పూర్వకంగా కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా, సంస్థ యాజమాన్యానికి… కంపెనీ నిర్వాహణలో ఇబ్బందులు కల్పించేలా రవి ప్రకాశ్ ప్రయత్నిస్తున్నారని టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అసలు శివాజీకి టీవీ9కు, రవి ప్రకాష్ కు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? రవి ప్రకాష్ ను వ్యతిరేకించే వారు శివాజీ ఆయనకు బినామీ అంటూ ఉంటారు. టీవీ9 ను నిర్వహించే ఏబీసీఎల్‌ కంపెనీలో రవిప్రకాశ్‌కు 20 లక్షల షేర్లు అంటే 8 శాతం వాటా ఉంది.

ఇందులోనుంచి 40 వేల షేర్లను కొనుగోలు చేసేందుకు రవి ప్రకాశ్‌కు 20 లక్షల రూపాయలు చెల్లించి ఫిబ్రవరి 20, 2018న ఒప్పందం కుదుర్చుకున్నానని, ఈ ఒప్పందం జరిగిన ఏడాదిలోగా షేర్లను తన పేరు మీద బదిలీ చేసేందుకు రవిప్రకాశ్ అంగీకరించారని, తాను అతని మీద నమ్మకం ఉంచానని శివాజీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వద్ద పేరుకున్నారు. రవిప్రకాష్ కు వత్తాసుగా కొత్త యాజమాన్యం తీసుకువస్తున్న నలుగురు కొత్త డైరెక్టర్లను అడ్డుకోవడానికి శివాజీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. దీనితో రవి ప్రకాష్ తో పాటు ఆయనను కూడా టార్గెట్ చేసింది కొత్త యాజమాన్యం. శివాజీ సినిమాలలో పెద్దగా సంపాదించింది లేదు. ఆ స్థాయి నుండి టీవీ9లో వాటా కొనుగోలు దాకా వచ్చారంటే అది ఖచ్చితంగా బినామీ డబ్బే అని కొందరి అభిప్రాయం.