Chandrababu-Naidu-called-for-a-Special-Press-Meet-and-lambasted-the-BJP-Government‘సేవ్‌ నేషన్‌’ పేరుతో భాజపాయేతర పార్టీలన్నింటనీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు గురువారం దిల్లీకి వెళ్తున్నారు. గత వారం రోజులలో ఇది చంద్రబాబు రెండవ ఢిల్లీ పర్యటన. ఈ పర్యటనలో భాగంగా ఆయన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కూడా కలవవచ్చని సమాచారం.

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా ఈ భేటీ కీలకం కానుంది. అలాగే, భాజపాయేతర కూటమి ఏర్పాటుపైనా రేపు ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్, తెలుగు దేశం కలిసి పనిచేస్తున్నాయి. దీనితో ఈ పొత్తు ఆంధ్రప్రదేశ్ కు, కేంద్ర స్థాయికి కూడా విస్తరించబోతుందా అని సర్వత్రా ఆసక్తి ఉంది.

దేశ రాజకీయాల దృష్ట్యా మూడవ ఫ్రంట్ కు అవకాశం లేదని, ప్రధాన జాతీయ పార్టీలు లేకుండా ఫ్రంట్లు సాధ్యం కావని ఇటీవలే చంద్రబాబు ఢిల్లీలో అభిప్రాయపడ్డారు. దీనితో కాంగ్రెస్ తో కలిపి బీజేపీయేతర ఫ్రంట్ కు చంద్రబాబు శ్రీకారం చుట్టినట్టుగా కనిపిస్తుంది. అయితే రాష్ట్ర విభజనకు కారణమని కాంగ్రెస్ ను భూస్థాపితం చేసిన ఆంధ్రప్రజలు దీనిని ఎలా చూస్తారో చూడాలి. అదే సమయంలో ఈ పొత్తును చంద్రబాబు ఎలా సమర్ధించుకుంటారో కూడా చూడాలి.