Chandrababu - Naidu - Delhi Press Meetవచ్చే ఎన్నికల వ్యూహరచన గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎంపీలు, మంత్రులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పొత్తుల విషయం ప్రస్తావనకు వచ్చిందట. తెలంగాణలో తెదేపాతో పొత్తుపై కాంగ్రెస్‌ నాయకులే మాట్లాడుతున్నారని ఎంపీ గరికపాటి మోహనరావు పేర్కొనగా… అలా మనమెప్పుడూ చెప్పలేదు కదా అని చంద్రబాబు అన్నారు.

కేంద్రంపై అవిశ్వాస తీర్మానం సమయంలోనూ కాంగ్రెస్సే స్వచ్ఛందంగా మద్దతిచ్చిందని, మనం అడగలేదని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ లో పొత్తు గురించి కూడా చంద్రబాబు అదే రకంగా స్పందించారు. ఇదే సమయంలో తెలంగాణలో పొత్తులు ఉంటాయని… అక్కడి నాయకులు, క్యాడర్‌తో కూడా చర్చించి సరైన నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు వ్యాఖ్యానించారని చెబుతున్నారు.

“తెలంగాణలో పార్టీని, క్యాడర్‌ను కాపాడుకోవాలి. దానికి ఎటువంటి వ్యూహం అవసరమో ఆ ప్రకారమే వెళ్దాం” అని చంద్రబాబు పార్టీ నాయకులకు తెలిపారని సమాచారం. దీనితో కాంగ్రెస్ తో కాకుండా పొత్తులు ఎవరితో ఉండబోతున్నాయని అంతా ఆశ్చర్యపోయారట.