Congress Party gathering reddy community leadersతెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో జాయిన్ కావడం దాదాపుగా ఖరారు ఐనట్టే. వచ్చే నెల 10న రాహుల్ గాంధీ సమక్షంలో వరంగల్ లో జరగనున్న భారీ బహిరంగ సభలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. మరో వైపు కేసీఆర్ పై ఆగ్రహంగా ఉన్న రెడ్డ్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంగా ఇది కనిపిస్తుంది.

రేవంత్ రెడ్డి తరువాత భాజపా నుండి నాగం జనార్ధన్ రెడ్డి తెదేపానుండి ఉమ మాధవ రెడ్డి ని కూడా కాంగ్రెస్లోకి తీస్కొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఆల్‌రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అద్యక్షుడుగా ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ అంటే తెలుగునాట రెడ్డి సామాజికవర్గ పార్టీ.

ఐతే వైయఎస్ జగన్ మోహన్ రెడ్డి వేరు కుంపటి పెట్టాక ఆంధ్రప్రదేశ్లో ఆ సామాజికవర్గం కాంగ్రెస్కు దూరం అయ్యింది. అలాగే తెలంగాణాలో తెలంగాణా రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చాక వెలమల రాజ్యం మొదలయ్యిందని రెడ్డి సామాజికవర్గం అసంతృప్తిగా ఉంది. రెడ్డి నాయకులందరిని ఒక తాటి పైకి తెచ్చి రాజకీయంగా పట్టున్న వారి సపోర్ట్ పొందాలని కాంగ్రెస్ వ్యూహం.

దీనిని ఆపడానికే కేసీఆర్ వెల్-కమ్ వ్యూహం తెరపైకి తెచ్చినట్టు సమాచారం. వెల్-కమ్ అనగా వెలమలు + కమ్మ కులస్థుల సమ్మేళనం. ఇందులో భాగంగానే కేసీఆర్ తెదేపాతో దోస్తీకి సిద్ధం అవుతున్నట్టు సమాచారం. మొతానికి 2019 ముందే తెలంగాణాలో కులాల కుంపటి మొదలయ్యిందని చెప్పుకోవాలి.