congress leader renuka chowdaryగడిచిన కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఒకప్పటి తెలుగుదేశం నేత, ప్రస్తుత కాంగ్రెస్ నేత అయిన రేణుక చౌదరి, ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, చంద్రబాబు సతీమణిని విమర్శించిన వారిని ఏకిపారేశారు.

మహిళలంటే మీకు అంత అలుసా? ఎక్కడ చూసినా మీరు తిట్టేది మహిళల ద్వారాయేనా? నువ్వెవడ్రా సవాల్ చేసేది, నువ్వు ఎవడికి పుట్టిన ముద్దుబిడ్డో ముందు మీ ఇంట్లో తెలుసుకుని రా! మా గురించి మాట్లాడకు, పోలికలు వాటి వీటి గురించి మాట్లాడిన చవట, వెధవ ఎవరు?

ఏం మాట్లాడతారండి వాళ్ళు… రాజకీయాల్లోకి వస్తే మీ ఇష్టమా? జయలలిత చీర లాగుతారా? లుంగీలు ఎవరివి అసెంబ్లీలో లాగలేదే? ఈ వేషాలు అరికట్టండి, నీకెంత హక్కు ఉందో రాజ్యాంగ పరంగా మీ కంటే ఎక్కువ హక్కు, అధికారం మాకు ఉంది.

మీరు మీరు మగవాళ్ళు కొట్టుకోండి, తిట్టుకోండి ఏమైనా చావండి, నాకు సంబంధం లేదు. ఒక మగవాడిని కించపరిచే దానికి ఆయనింట్లో ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని పిచ్చిపిచ్చిగా మాట్లాడితే, ఎవడైనా గానీ వచ్చి మీ దవడ పళ్ళు ఊడగొడతా నేను.

మేము బ్రతకడానికి మీ సర్టిఫికెట్ కావాలా? మాకు అవసరం లేదు, సీతమ్మ కాలం నుండి శీలపరీక్ష, అగ్ని పరీక్షలే జరుగుతున్నాయి, మిగతా వాళ్ళు ఎవరూ చేయరే! ఇది నాతో చెల్లుబాటు కాదు. జరిగింది ఒక నాన్సెన్స్, చంద్రబాబు కూడా అలా స్పందించి ఉండాల్సింది కాదు.

ఆయన ఏడ్చే కన్నా రెండు లాగిపెట్టి కొడితే బాగుండేది అన్న రేణుకా చౌదరి, ఈ విషయంలో స్పీకర్ చేసిన విషయాన్ని కూడా నాన్సెన్స్ గా పరిగణించారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబుని స్పీకర్ ఎందుకు మాట్లాడనివ్వలేదు, స్పీకర్ కుర్చీలో కూర్చుని అంత బలహీనంగా బతుకుతున్నావా?

ఏంటి రాజ్యాంగం ఈ పోస్ట్ లన్నీ క్రియేట్ చేసారు? అంత తొత్తులుగా బతకాలనుకుంటే, వెళ్ళండి ఇళ్లల్లో కూర్చోని వాళ్ళకు ఇల్లు తోమండి, గిన్నెలు తోమి పెట్టండి అంటూ తన ఫైర్ బ్రాండ్ వాయిస్ ను వినిపించారు రేణుక. తెలుగుదేశం పార్టీ ఇలాంటి “ఫైర్ బ్రాండ్” వాయిస్ ను వినిపించడంలో విఫలమవుతోందన్నది మాత్రం వాస్తవం.