KCR Chandrababu Naiduతెదేపా, తెరాస పొత్తుపై వూహగానాలు రోజురోజుకూ ఊపందుకుంటున్నాయి. విశేషం ఏంటంటే రెండు వైపులనుండి ఇప్పటివరకు దీనిని గట్టిగా ఖండించిన వారు లేరు. పైగా తెరాస మంత్రులు వాటికి ఊతమిచ్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్న తుమ్మల నేడు తలసాని ఈ కోవలో చేరారు.

“తెదేపా, తెరాస పొత్తులపై సమయం వచ్చినప్పుడు సీఎం నిర్ణయిస్తారు. దీనిపై ఇప్పటికైతే మాట్లడానికి ఏమీ లేదు. తెలంగాణలో తెదేపా ఉందా అనే అనుమానం ఉంది,” అని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వంలో ఉన్న వారికి అంతో ఇంతో ప్రజా వ్యతిరేకత ఉండటం సహజం. ఆ లాస్ను టిడిపి తో పొత్తు వల్ల వచ్చే 5-6%ఓట్లతో పూడ్చుకోవాలని కేసీఆర్ వ్యూహం

టిడిపి అదినేత,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిఆర్ ఎస్ తో పొత్తు ఉండదని స్పష్టంగా చెప్పకపోవడం పై రేవంత్ వర్గం గుర్రుగా ఉన్నట్టు సమాచారం. టిఆర్ఎస్ తో టిడిపి పొత్తు ఉన్నట్టు ఐతే ఆ ప్రభావం ఆంధ్ర రాజకీయాలపై కూడా తప్పకుండా ఉంటాడి. అటువంటి సందర్భంలో మొదటికే మోసం జరగొచ్చుకూడా. కావున ఈ పుకర్లతో రెండు రాష్ట్రాల్లోని టిడిపి అభిమానులు కూడా అయోమయంలో ఉన్నారు.