Comptroller and Auditor General slams govt failing to utilize funds for Ganga river cleaningఢిల్లీలో మోడీ ప్రభుత్వం కొలువు తీరాక గంగ నది ప్రక్షాళన తమకు ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అని ప్రకటించి దానికి ఒక మంత్రిపదవి కూడా ఏర్పరిచారు. అయితే మోడీ ప్రభుత్వం నిర్వాకాన్ని కాగ్ బయటపెట్టింది. ఈ ప్రాజెక్టు కు 2600 కోట్లు మంజూరు చేస్తే దీనిలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు.

ఆ సొమ్ములన్నీ బ్యాంకు ఖాతాలలో మూలుగుతున్నాయి. హిందుత్వ నామ స్మరణ నిత్యం చేసే భాజపా గవర్నమెంట్ కు గంగ నది ప్రక్షాళనపై ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఇట్టే అర్ధం అవుతుంది. ఇప్పటికి నదిని ఎలా ప్రక్షాళన చెయ్యాలనే దానిపైన గవర్నమెంట్ కు ఎలాంటి ప్లాన్ లేదని కాగ్ ఆక్షేపించింది.

తమ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అని చెప్పుకునే ప్రాజెక్ట్ పరిస్థితే ఇలా ఉంటే ఇదే కేంద్ర ప్రభుత్వం పోలవరం కడుతుందంట. ఇలాంటిది ఏదో జరుగుతుందని ఊహించే చంద్రబాబు పోలవరం నిర్మాణ బాధ్యత తీసుకున్నారు. అయితే దానిని వాడుకుని ఆయననే ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

కేంద్రం నిర్మాణం చేపడుతున్న వివిధ జాతీయ ప్రాజెక్టులు ఎలాంటి పురోగతి లేకుండా ఏళ్ళ తరబడి మగ్గుతున్నాయి. అయితే తమకు రాజకీయంగా అవసరమైన గుజరాత్ వంటి రాష్ట్రాలలో మాత్రం జాతీయ ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తుంది కేంద్రం. అయితే కమలం పార్టీకి ఎలాంటి భవిష్యత్తు లేని ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు ఎలా చేపడతారో మనం ఊహించగలం!