Complaint on Somu Veerrajuరాష్ట్రంలోని పేదల కోసం రూ.50వేల కోట్లతో ఇళ్లు కట్టించబోతున్నామని…జగన్ సర్కారు పదే పదే ఊదరగొడుతుంది. అయితే ఈ పథకం చాలా వరకు కేంద్ర నిధులతోనే జరుగుతుందని… రాష్ట్ర భాగస్వామ్యం చాలా స్వల్పంగానే ఉంటుందని రాష్ట్ర బీజేపీ చెప్పుకోలేకపోవడం పార్టీ నాయకుడు సోము వీర్రాజు తో పాటు ఇతర ముఖ్య నాయకుల అధికార పార్టీ ప్రీతికి నిదర్శనమని బీజేపీ సమర్ధకుల నుండే విమర్శలు రావడం గమనార్హం.

పట్టణాలు, గ్రామాల్లో ఎక్కడ ఇళ్లు కట్టుకున్నా ఇంటికి రూ.1.80 లక్షల రాయితీ ఇస్తుంది జగన్ ప్రభుత్వం. అందులో రూ.1.50 లక్షలు కేంద్రం రాయితీ… గ్రామీణ ప్రాంతాల్లో మిగిలిన రూ.30వేల రాయితీని ఉపాధి హామీ పథకం అనుసంధానం ద్వారా సర్దుబాటు చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఒక్కో ఇంటికి రూ.30వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద భరించనుంది.

గ్రామాల్లో ఏ ఇంటికీ ఒక్క రూపాయి కూడా రాష్ట్రం ఖర్చు చెయ్యడం లేదు. ఇది చాలదు అన్నట్టు.. కాలనీలకు తాగునీటి సరఫరా, విద్యుదీకరణ, రోడ్లు, డ్రైనేజీ లాంటి పనులు చేపట్టేందుకు రూ.34,109కోట్లు సర్దుబాటు చెయ్యమని ఇటీవలే జగన్ కేంద్రానికి లేఖ రాశారు. ఈ కాలనీల కోసం భూములు ఎక్కువగా ప్రభుత్వం నుండి తీసుకున్నవే… ప్రైవేట్ వారి నుండి తీసుకున్న భూములకు ఎక్కువ రేట్లు చెల్లించి అధికార పార్టీ వారు లాభపడ్డారని పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఉన్నాయి.

సరిగ్గా వాడుకుంటే ఈ విషయం తమకు బాగా కలిసి వస్తుందని అయితే రాష్ట్ర పార్టీలోని కొందరు నాయకులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ పూర్తిగా నిద్రావస్థలో ఉన్నారని… కేంద్ర ప్రభుత్వం తట్టి లేపాలని కేంద్రానికి ఒక లేఖ రాశారని సమాచారం. అయితే సోము అండ్ గ్యాంగ్ మీద అధిష్టానం చర్యలకు ఉపక్రమిస్తుందేమో చూడాలి.