competition between Nagarjuna and NTR Should there be logicమొట్టమొదటి సారిగా తెలుగు టెలివిజన్ లో ఇద్దరు స్టార్ హీరోల కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. ఎన్టీఆర్ జెమినీ టీవీ కోసం చేస్తున్న ఎవరు మీరు కోటీశ్వరులు ఇప్పటికే ప్రసారం అవుతుండగా… నాగార్జున స్టార్ మా కోసం చేస్తున్న బిగ్ బాస్ 5 ఈ మధ్యనే మొదలయ్యింది.

ఇద్దరు ఇప్పటికే టెలివిజన్ లో కూడా ప్రూవెన్ స్టార్లు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్తగా ఒక చర్చ మొదలయ్యింది. ఈ ఇద్దరు స్టార్లలో ఎవరు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనేది చర్చ.ఆ నెంబర్ ఎక్కడ పెట్టారో తెలీదు గానీ ఇద్దరు హీరోల అభిమానులు తమ అభిమాన నటులకు 12 కోట్లు వస్తున్నాయి అని చెబుతున్నారు.

ఎన్టీఆర్ కు ఆ మొత్తంలో రెమ్యూనరేషన్ వస్తుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటుంటే… అది నిజం కాదు నాగార్జున కు మా వాళ్ళు 12 కోట్లు ఇస్తున్నారు. ఎన్టీఆర్ కు ఇంకా తక్కువ అని వాదిస్తున్నారు అక్కినేని అభిమానులు. అసలు ఇందులో అసలు వాదన ఎక్కడిది అనేది అర్ధం కాదు.

ఎన్టీఆర్ స్టార్ హీరో… నాగార్జున సీనియర్ హీరో… ఇద్దరికీ సమానంగానో లేక నాగార్జున కు ఎక్కువగానో రెమ్యూనరేషన్ ఇచ్చే అవకాశం ఎక్కడ ఉంటుంది? నాగార్జునకు ఆ మేర రెమ్యూనరేషన్ ఇచ్చే అవకాశాలు తక్కువ. బహుశా ఒక సినిమా తో సమానంగా ఈ షోకి ఇచ్చి ఉండవచ్చు. అయితే ఎన్టీఆర్ కు ఖచ్చితంగా నాగార్జున కంటే ఎక్కువ వస్తుంది. ఇందులో వాదన అనవసరం.

అటువంటి విషయాన్ని తెరమీదకు తెచ్చి దాని మీద చర్చ పెట్టి నాగార్జున అభాసుపాలు చెయ్యడం ఎందుకో?