Communists wants contunue with pawan kalyan JanaSenaనిర్దుష్ట విధి విధానాలు ప్రకటిస్తే ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు నిన్న స్పష్టం చేశారు. భాజపా, తెదేపా, వైకాపా కన్నా మిన్నగా భవిష్యత్తులో వామపక్షాలు, జనసేన కలిసి అద్భుత శక్తిగా ఎదుగుతామని పేర్కొన్నారు.

అయితే జనసేనతో వామపక్షాలు ఇప్పటికే నెలకు రెండు సార్లు సమావేశం అవుతున్నట్టు అవుతున్నాయి. జనసేన పోరాట యాత్రకు తమ వంతుగా జనసమీకరణ కూడా చేస్తున్నాయి. అదే విధంగా కమ్యూనిస్టులకు చెందిన టీవీ ఛానళ్ళు కూడా జనసేన భజన చేస్తున్నాయి. సిపిఐకి చెందిన ఒక ఛానల్ ను అయితే ఇప్పటికే జనసేన తీసుకుంది.

ఇంత చేసి ఇప్పుడు వచ్చి రాఘవులు ఉన్నఫళంగా నిర్దుష్ట విధి విధానాలు ప్రకటిస్తే ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధం అనడమేంటో? జనసేన కు సంబంధించిన నిర్దుష్ట విధి విధానాలు తెలియకుండానే వామపక్షాలు ఇప్పటివరకు జనసేనతో కలిసి పని చేశాయా? కొత్తగా వారికి కావాల్సిన వివరాలేంటో?