Communist Parties with Pawan Kalyanజనసేన అధినేత పవన్ కళ్యాణ్ వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటారని ఊహాగానాలు సాగేవి. ఆ పార్టీలతో కలిసి ఆయన వివిధ కార్యక్రమాలలో పాల్గొనడం కూడా అందుకు దోహదం చేసింది. అయితే తాజాగా ఎవరితో పొత్తులు ఉండవన్న సంకేతం ఇవ్వడమే కాకుండా 175 సీట్లకు జనసేన పోటీచేస్తుందని, అందుకు తగిన విధంగా పార్టీని నిర్మిస్తామని పవన్ ప్రకటించడం వామపక్షాలకు షాక్ ఇచ్చింది.

దీంతో వామపక్షాలకు కాస్త నిరాశకు గురై ఉండాలి. జనసేనను అడ్డం పెట్టుకుని ఎలా అయినా ఆంధ్రప్రదేశ్ లో బలపడాలి అనే ఉద్దేశంతో ఉన్నారు వామపక్షాలు ఇప్పటిదాకా. పవన్ కళ్యాణ్ కూడా వామపక్షాల ఉద్యమ అనుభవాన్ని వాడుకుని ప్రజలకు దగ్గర అవ్వాలని చూసారు. అయితే సాధారణ ఎన్నికలకు ఒక ఏడాది సమయం ఉండటంతో ఇరు పక్షాలు ఇక ముందు కలిసి పనిచేస్తాయో లేదో చూడాలి.

మరోవైపు ఇప్పటినుండే అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో ఉన్నారంట జనసేనాని. తొందర్లో ఆ పని పూర్తి చేసి అభ్యర్థులకు నియోజకవర్గాలలో పని చేసుకోవడానికి తగిన టైం ఇవ్వాలని పవన్ అభిప్రాయమట. పవన్ కళ్యాణ్ మొత్తానికి దీనిపై ఒక ప్రకటన చెయ్యడంతో జనసేన పోటీ తో ఎవరికీ లాభం ఎవరికీ నష్టం అనేది బేరీజు వేసుకునే పనిలో ఉన్నాయి మిగతా పార్టీలు.