Communist parties CPI CPM  - Pawan Kalyan-JanaSenaవచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని వామపక్షాలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నిర్ణయించింది. మరో వారం రోజుల్లో విజయవాడలో జనసేన-వామపక్షాల ప్రత్యేక సదస్సు జరగనుంది. భూ సేకరణ, ప్రత్యేక హోదా, పలు ప్రజా సమస్యలపై ఉమ్మడి అజెండా ఖరారు చేయాలని నిర్ణయించారు.

అయితే ప్రాధమికంగా జనసేన వామపక్షాలకు ఎన్ని సీట్లు కేటాయిస్తుంది అనే దాని మీద ఇంకా స్పష్టమైన వివరణ రాలేదు. ఆ వివరణ బట్టి అసలు ఈ పొత్తు వల్ల వచ్చే లాభనష్టాలను అంచనా వెయ్యొచ్చు. అయితే మునుపటిలా కమ్యూనిస్టులకు రాష్ట్రంలో ప్రభావం లేదు. వారితో వచ్చే ఓట్ల వల్ల పెద్దగా ఉపయోగం లేదనే చెప్పుకోవాలి.

కాకపోతే వారు చేసే ప్రజాపోరాటాలు, జనసమీకరణ జనసేనకు బాగా ఉపయోగ పడతాయి. ఇప్పటికే జనసేన పోరాట యాత్ర ఉత్తరాంధ్రలో వామపక్షాలు గణనీయంగా పనిచేసాయి. ఒక దశలో పవన్ కళ్యాణ్ ఒంటరిగానే పోటీ చేస్తా అని చెప్పుకున్నా ఈ సమయంలో వామపక్షాలను వదిలేస్తే వాడుకుని వదిలేశారు అని అపప్రధ వస్తుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడినట్టు సమాచారం.