Comedian Sunil comments on mahesh babu“పుష్ప” ద్వారా తనలోని మరో కొత్త యాంగిల్ ను ప్రేక్షకులకు పరిచయం చేసి మెప్పు పొందిన ఒకప్పటి టాలీవుడ్ టాప్ కమెడియన్, ఆ తర్వాత హీరో, ప్రస్తుత ‘పుష్ప’ విలన్ సునీల్ తన భావాలను ఓ మీడియాతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబుపై తనకున్న అభిప్రాయాన్ని పంచుకోగా, ఈ క్లిప్ ను అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పోల్చడానికి ‘గొడ్డు’తో పోల్చినా, అది మహేష్ పడే కష్టానికి ప్రతీకగా నిలవడంతో, సునీల్ పోలిక సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను ఫిదా చేసింది.

చూడడానికి క్యూట్ గా యంగ్ జేమ్స్ బాండ్ లా కనిపిస్తాడు గానీ, గొడ్డు కష్టం పడతాడని, ముఖ్యంగా ఫైట్స్ లో అయితే మూడు, నాలుగు ఫ్లోర్స్ లో రోప్ లు కట్టేసి వ్రేలాడదీస్తారు, ఇక గొడ్డే, అది అయ్యే దాకా అంతలా కష్టపడతారని, డైరెక్టర్ ను నమ్మితే ఇంకా లైఫ్ ఇచ్చేస్తాడు, అది తనకు బాగా నచ్చే గుణమని చెప్పుకొచ్చారు సునీల్.

ఈ ‘పుష్ప’ విలన్ చెప్పిన ముచ్చట్లు కొత్తవేమీ కాకపోయినా, మహేష్ ‘సర్కార్ వారి పాట’ సినిమా అప్ డేట్స్ లేక అల్లాడుతున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు సునీల్ వ్యాఖ్యలు ఓ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. “ఒక్కసారి నమ్మితే సినిమాకు ప్రాణం పెట్టేసాడని” సూపర్ స్టార్ తో వర్క్ చేసిన దర్శకులందరూ కూడా ఇదే మాట చెప్పారు.