Comedian Sudhakar with Sai Dharam Tejటాలీవుడ్ లో కమెడియన్ సుధాకర్ అంటే టక్కున అందరికీ తెలియకపోవచ్చు గానీ… బిషబిష సుధాకర్ అంటే మాత్రం… తెలియకుండా ఉండరు. కెరీర్ తొలినాళ్ళల్లో విలన్ క్యారెక్టర్లు చేసిన సుధాకర్, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేషాలతో పాటు, కమెడియన్ గా కూడా ప్రేక్షకులలో విశేషమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే నవతరం కమెడియన్స్ ఎంట్రీతో గత కొన్ని సంవత్సరాలుగా సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉంటూ వస్తున్నాడు.

అలాంటి సుధాకర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇస్తూ నెటిజన్లకు కనిపించగా… తాజాగా “జవాన్” సినిమా ప్రివ్యూ సందర్భంగా తారసపడ్డారు. సినీ ఇండస్ట్రీలోని క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు మరియు కమెడియన్ల కోసం “జవాన్” సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించగా, ఈ షోకు సుధాకర్ హాజరయ్యారు. చాలా కాలం తర్వాత ప్రేక్షకులకు కనిపించిన సుధాకర్ ఫోటోలను చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో “జవాన్” ప్రివ్యూ షో కాస్త సుధాకర్ ఫోటోలను హైలైట్ చేసింది.