Comedian srinivas reddy with Jr NTR and Trivikram Srinivasకొంతమంది వ్యక్తుల కారణంగా ఎన్టీఆర్ కు – తనకి మధ్య దూరం పెరిగిందని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో కమెడియన్ శ్రీనివాసరెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. అవకాశం చిక్కినప్పుడు ఎన్టీఆర్ తో మాట్లాడి అపోహలను చెరిపేస్తానని అన్నాడు. అయితే ఈ అవకాశాన్ని త్రివిక్రమ్ ‘అరవింద సమేత వీర రాఘవ’ రూపంలో శ్రీనివాసరెడ్డికి అందించారు. ఈ సినిమాలో కమెడియన్ గా ఓ పాత్ర పోషిస్తోన్న ఈ కమెడియన్, తాజాగా ఎన్టీఆర్ ను కలుసుకునే అవకాశం లభించింది.

ప్రస్తుతం ఎన్టీఆర్ – శ్రీనివాసరెడ్డి కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలను త్రివిక్రమ్ చిత్రీకరిస్తున్నారు. అయితే గతంలో ఉన్న అనుబంధం రీత్యా, వీరిద్దరి మధ్య సఖ్యత లేదన్న టాక్ వచ్చిన నేపధ్యంలో… తాజాగా ఓ సెల్ఫీతో వీటన్నింటికి ‘త్రివిక్రమ్ అండ్ కో’ చెక్ పెట్టారు. ‘అరవింద సమేత వీర రాఘవ’ సెట్లో ఎన్టీఆర్ – శ్రీనివాసరెడ్డి – త్రివిక్రమ్ లు తీసుకున్న ఓ సెల్ఫీని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. దీంతో ‘జంబలకిడి పంబ’ హీరోకు లైన్ క్లియర్ అయినట్లయ్యింది.