కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన “జయమ్ము నిశ్చయమ్మురా” సినిమా గత వారం విడుదలై ప్రేక్షకుల నుండి భిన్నాభిప్రాయాలను దక్కించుకుంది. ముఖ్యంగా సినిమా నిడివి విషయంలో పలు సూచనలు రావడంతో, దాదాపు 15 నిముషాల పాటు సినిమాను కత్తెరించారు. దీని తర్వాత తమ సినిమాకు టాక్ బాగుందని, అంతకు ముందు వ్యక్తమైన ‘స్లోగా ఉందనే’ విమర్శ రావడం లేదని, ఇటీవల ‘సక్సెస్ మీట్’ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన చిత్ర హీరో శ్రీనివాసరెడ్డి… ‘ఈ సినిమాలో ఒక్క సీన్ లో అయినా హీరోయిన్ కు ఐ లవ్ యూ చెప్పించమన్నానని, అలాగే కనీసం ఒక్క హగ్, ఒక్క కిస్సు ఇప్పించమంటే… అన్నీ సక్సెస్ మీట్ లోనే అని దర్శకుడు చెప్పారని’ అన్నారు. అయితే అంతకు ముందే… హీరోయిన్ పూర్ణకు శ్రీనివాసరెడ్డి ‘ఐ లవ్ యూ’ అంటూ ప్రపోజ్ చేయడం, ఆ తర్వాత ఆమె ఓ హగ్ ఇవ్వడం జరిగిపోయింది.
పబ్లిసిటీ కోసం చేసారో లేక అలా జరిగిపోయిందో గానీ స్టేజ్ పైనే హీరోహీరోయిన్ల ‘ప్రపోజల్’ సీన్ ఈ సక్సెస్ మీట్ కు హైలైట్ అయ్యింది. తక్కువ బడ్జెట్ లో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు రెవిన్యూ పర్వాలేదనిపించే విధంగానే ఉండడంతో హీరోగా భారీ సక్సెస్ అందుకోలేకపోయినా… భారీ ఫెయిల్యూర్ ను మాత్రం మూటకట్టుకోలేదన్న టాక్ ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.