Comedian Prudhviraj Supports Low Budget Moviesచిన్న సినిమా ఎప్పుడూ బాగుండాలనే తాను కోరుకునే వారిలో తానూ ఒకడినని, పెద్ద సినిమాల్లో అవకాశాలు రావాలంటే చిన్న సినిమాల్లో నటించాలని, అందుకే, ఈ చిన్న సినిమాలు బాగుండాలని అభిలాషిస్తానని ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పృధ్వీ అన్నారు. చిన్న సినిమా అనేది తల్లి లాంటిదని, అది ఎప్పుడూ బ్రహ్మాండంగా ఉండాలి, అవి లేకపోతే తాను లేనని స్పష్టంగా చెప్పారు.

ఒకప్పుడు అరకిలో బియ్యం వండుకుని తినడం దగ్గర నుంచి, రెండు వేల రూపాయల లంచ్ చేసే వరకు నటుడు ‘తాగుబోతు’ రమేశ్, తాను కలిసే ఉన్నామని గత అనుభూతులను పంచుకున్నారు. తాగుబోతు రమేష్ కూడా ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అయింది, మేమిద్దరం కలిసి చాలా రోజులు ఉన్నాం. ఇంతమంది కమెడియన్స్ ఉన్నా కూడా, తాగుబోతు రమేష్ వేరియషన్ వేరు. ఇంకా అతనితో ‘మందు’ డైలాగులే చెప్పిస్తున్నారు కానీ, అతన్ని సరిగ్గా ఇండస్ట్రీలో ఉపయోగించుకోవట్లేదని’ అన్నారు పృథ్వీ.

తాను బిజీ కాకముందే దీపావళి పండగ బాగా జరుపుకునేవాడినని, చుట్టాలు, బంధువులు, అందరూ కలుస్తుండే వారని, షూటింగ్ ఉన్నా కూడా మధ్యలో ఇంటికెళ్లి శుభ్రంగా భోజనం చేసి వెళ్లిపోయేవాడినని, ఈ బిజీ జీవితంలో అన్నీ మిస్సయిపోతున్నామని… ఒక సెలబ్రిటీకుండే కష్టాలను వెలిబుచ్చారు. ప్రస్తుతం పృధ్వీ హీరోగా నటిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ విశేషాలను పంచుకున్నారు.