Comedian Prudhvi Raj responds on rumours over mega family banఆ మధ్య వచ్చిన ఒక నితిన్ సినిమాలో విలన్ అందరికీ ఆ పిల్లోడు నన్ను కొట్టలే అంటూ చెప్పుకుంటూ తిరుగుతాడు. ఇప్పుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి పరిస్థితి అలానే ఉంది. నిన్న వచ్చిన ఒక వార్త ప్రకారం ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ కు మద్దతుగా జనసేనను దూషించినందుకు అల్లు అర్జున్ ఆయనను తన తదుపరి చిత్రం నుండి తప్పించారట. పృథ్వి మీద ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలలో అనధికార బ్యాన్ ఉందట.

దీనితో పృథ్వికి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయట. “అసలు ఆ సినిమాకు నన్ను అడగలేదు. ఇంక తీసేసే పరిస్థితి ఎక్కడ వస్తుంది? ఇండస్ట్రీలో అంతా ప్రొఫెషనల్స్ వారు సినిమాను రాజకీయాలను విడిగానే చూస్తారు” అని ఫోన్లు చేసిన వారందరికీ చెప్పిందే చెప్తున్నాడంట పృథ్వి. ఒకవేళ నిజంగా జరిగినా బయటకు చెప్పుకుంటాడా అని ఇంకొందరి అనుమానం. పృథ్వి ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ కోసం సామాన్య కార్యకర్తలా పని చేసారు. సహజంగా సినిమా యాక్టర్లు రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చినా వెళ్లి నాలుగు ఫోటోలు తీయించుకుని వచ్చేస్తారు.

ఈ ఎన్నికల సమయంలో చాలా మంది అలా చేశారు కూడా. అయితే పృథ్వి మాత్రం జగన్ వెంట నడిచి రిస్క్ అని తెలిసినా ప్రభుత్వం మీద ఇతర పార్టీల మీద విమర్శలు చేసేవారు. ఒక ఇండస్ట్రీ వాడైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కూడా వదల్లేదు పృథ్వి. అయితే పృథ్వికి జగన్ ఏదైనా మంచి నామినేటెడ్ పోస్టు ఇచ్చి గుర్తిస్తారేమో చూడాలి. ఇటీవలే ప్రభుత్వం మారడంతో సీనియర్ నిర్మాత అంబికా కృష్ణ ఖాళీ చేసిన ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి తనకు ఇస్తారని పృథ్వి ఆశిస్తున్నారు.