comedian Pruthvi Raj30 ఇయర్స్‌ ఇండస్ట్రీ పృధ్వీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి తన సేవలకు ఏకంగా ఎస్వీబీసి ఛైర్మన్ పదవిని పొందారు. తొలినాళ్ళ లో కొండ పైన ఆయన హవా అంతా ఇంతా కాదు. అయితే తదుపరి కాలంలో ఆయన ఒక ఫోన్ స్కాండల్ లో దొరికిపోయి పదవి పోగొట్టుకున్నారు.

అయినా టీవీ ఇంటర్వ్యూలలో జగన్ ని బాగా పొగిడి ఏదోరకంగా ఆయనను ప్రసన్నం చేసుకునే పనిలో ఉంటున్నారు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో… వైసీపీలో కలకలం రేపుతున్న నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గ రాజకీయం గురించి మాట్లాడుతూ…. అక్కడ ఉప ఎన్నికలు వస్తే ఆ సీటు తాను ఆశిస్తున్నట్టు తెలిపారు.

‘అవకాశం వుంటే ఆ సీటు నాకు ఇవ్వమని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని అడుగుతాను. ఉప ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తాననే నమ్మకం నాకుంది’ అంటూ వైసీపీ అనుకూల మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు పృధ్వీ. ఓ మహిళ పట్ల అసభ్యంగా పృధ్వీ వ్యవహరించారనీ, మహిళల్ని ప్రలోభపెట్టి, అడ్డగోలుగా నియామకాలకు తెరలేపారని ఆరోపణలు ఉన్న పృథ్వికి సీటు ఇస్తారా?

ఒకవేళ ఇస్తే ఆయనకు గెలిచే అవకాశం ఏ మాత్రం ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు. “నరసాపురంకు ఉపఎన్నికలు వచ్చే అవకాశాలు తక్కువే ఒకవేళ వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ తరపున గోకరాజు గంగరాజు కుమారుడు గోకరాజు కుమారుడు రంగరాజు ఆ సీటు దక్కించుకునే అవకాశం ఉంది,” అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.