CM-YS-Jagan-Pays-Tributes-to-Police-Martyrsపోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన సంస్మరణ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పోలీసుల మీద, పోలీసు అమరవీరుల మీద పొగడ్తలతో ముంచెత్తారు. వారికి సెల్యూట్ చేస్తున్నా అని చెప్పుకొచ్చారు.

అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ప్రకటించాం, జీతాలు పెంచాం, మరణిస్తే ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నాం అంటూ ప్రకటించారు. అయితే ముఖ్యమంత్రి స్పీచ్ మీద సోషల్ మీడియాలో విసుర్లు వినిపిస్తున్నాయి. “గతంలో ఇదే జగన్ ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదని తెలంగాణలో కేసులు పెట్టే వారు ఇప్పుడు అభిప్రాయం మార్చుకున్నట్టు ఉన్నారు. మంచిదే,” అని పలువురు అంటున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు మాత్రం జగన్ హయంలో పోలీసు వ్యవస్థలో మార్పు తీసుకుని వచ్చి జగన్ సెల్యూట్ చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు. అయితే ఈ వాదన పోలీసు వ్యవస్థను మెచ్చుకున్నట్టా తిట్టినట్టా? పోలీసులు ఎవరు అధికారంలో ఉంటే వారు చెప్పినట్టు నడుచుకుంటారు అని పరోక్షంగా చెప్పినట్టే కదా?

ఇది పోలీసు వ్యవస్థను కించపరిచినట్టే కదా అని విమర్శకులు అంటున్నారు. విమర్శనాత్మకంగా ఎవరు ఏమని చెప్పినా, పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ము కాస్తుంది అనే అపప్రధను తొలగించుకోవడానికి ఆ డిపార్టుమెంటు చెయ్యాల్సింది ఎంతో ఉంది అనేది కాదనలేని అంశం.