CBI-Court-Serious-on-CM-YS-Jaganఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఒక పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుండీ కోర్టుకు హాజరు కాకపోవడంపై నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు సీరియస్ అయ్యింది. ఈ కేసులో ఏ1, ఏ2 నిందితులు ప్రతి శుక్రవారం విచారణకు హాజరు కావాల్సిందేనని జగన్ తరఫు న్యాయవాదికి సీబీఐ కోర్టు చెప్పింది.

వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఇదివరకు సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు దానిని కొట్టివేసింది. అప్పటి నుండీ ప్రతీ శుక్రవారం ఏదో ఒక కారణంతో కోర్టుకు రాకుండా పిటిషన్ వేసి అనుమతి పొందుతూ వచ్చారు.

అయితే ఇప్పటివరకూ ఉపేక్షించిన కోర్టు ఇక కుదరదని తేల్చి చెప్పింది. ఏ1, ఏ2 నిందితులుగా ఉన్న జగన్, విజయసాయిరెడ్డి కోర్టుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈనెల 10న విచారణకు హాజరై తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. నేరానికి, హోదాకు సంబంధం లేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

దీనితో ఏదైనా పై కోర్టుకి వెళ్లి అనుమతి తెచ్చుకుంటే తప్ప ముఖ్యమంత్రైన తరువాత జగన్ మొదటి సరిగా ఈ నెల 10న సిబిఐ కోర్టు ముందు హాజరు కాబోతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి వస్తే అది వైఎస్సార్ కాంగ్రెస్ కు రాజకీయంగా ఇబ్బందే అని చెప్పుకోవాలి. అయితే పై కోర్టుకు వెళ్లి కాదని అనిపించుకుంటే అది మరింత అప్రతిష్ట.