అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామన్నతన పాదయాత్ర సమయంలో చేసిన హామీ ప్రకారం వైఎస్ జగన్మహన్ రెడ్డి ప్రభుత్వం చెల్లింపులకు సిద్ధం అవుతుంది. బాధితుల్లో 3,69,655 మందికి తొలివిడతలో చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వం సర్వం సిద్దం చేసింది. మొదటి విడతలో 10000 లోపు ఉన్న వారికి చెల్లింపులు చేస్తున్నారు.
తరువాతి విడతలో 20000 రూపాయిల లోపు ఉన్నవారికి ఇస్తారట. మొదటి విడత చెల్లింపుల కోసం 263.99 కోట్ల రూపాయలను విడుదల చేసింది ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని బాధితులు ఆహ్వానిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకూ సమంజసం అన్న ప్రశ్న రాకమానదు. ఒక ప్రైవేటు సంస్థ ప్రజలను వంచించి మోసం చేసింది.
ప్రభుత్వాలు బాధితుల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగేలా చూడాల్సిందే. అయితే ఆ సొమ్ములు తామే ఇవ్వడం ఎంతవరకూ కరెక్టు? ఎక్కువ వడ్డీకి ఆశపడి ప్రజలు ఇటువంటి సంస్థల భారిన పడుతూనే ఉన్నారు. మొన్న ఆ మధ్య పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక చిట్ ఫండ్ సంస్థ దాదాపుగా 150 కోట్లకు ఎగనామం పెట్టి బోర్డు తిప్పేసింది.
ప్రభుత్వం అక్కడి బాధితులకు కూడా డబ్బులు ఇస్తుందా? అగ్రిగోల్డ్ బాధితుల పట్ల ప్రభుత్వానికి ఎటువంటి బాధ్యత ఉంటుందో అక్కడ వారి పట్ల కూడా అదే బాధ్యత ఉండాలి. అయితే ఇలా ఇచ్చుకుంటూ పోతే ఎలా? ఇటువంటి విషయాలలో ఏ ప్రభుత్వం చేసినా తప్పు తప్పే కదా?
Dallas Kamma Folks Behind Acharya Sales?
Jagan Can’t Complete Full Term?