class-for-ntr-mass-for-balakrishnaనందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన “డిక్టేటర్” సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైంది. టైటిల్ కు తగ్గ స్థాయిలో సినిమా లేకపోవడంతో ప్రేక్షకుల నుండి భిన్న స్పందనలు తెచ్చుకుంది. ‘ఎ’ సెంటర్ ఆడియన్స్ టాక్ ఎలా ఉన్నా, బి,సి సెంటర్లలో మాత్రం కాస్త పర్వాలేదనిపించే విధంగా ఉంది. ‘రొటీన్ మాస్ మసాలా సినిమా’గా విమర్శకులు కూడా తేల్చేసారు. దీంతో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన రెండు సినిమాలపై ఓ క్లారిటీ వచ్చేసింది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన “నాన్నకు ప్రేమతో” కేవలం ‘క్లాస్’ వర్గాలకు మాత్రమే పరిమితమవ్వగా, నందమూరి నటసింహం బాలకృష్ణ “డిక్టేటర్” సినిమా ‘మాస్’ వర్గాలను మాత్రమే ఆకర్షిస్తోంది. జూనియర్ సినిమాలో ఉన్న మైండ్ గేమ్ కు మాస్ ప్రేక్షకులు కేకలు పెడుతుండగా, బాలయ్య సినిమాలో ఉన్న రొటీన్ మాస్ ఎలిమెంట్స్ ను చూసి క్లాస్ ప్రియులు గగ్గోలు పెడుతున్నారు.

దీంతో ఇపుడు చూపులన్నీ నాగార్జున “సోగ్గాడే చిన్నినాయనా” సినిమాపై పడ్డాయి. ఫ్యామిలీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న ఈ సినిమా పైనే సంక్రాంతి సినీ ప్రేక్షకుల ఆసక్తి మళ్ళింది. మరి ఈ సినిమా అయినా ఆశించిన రీతిలో ప్రేక్షకులను అలరిస్తుందా? లేక రెండు చిత్రాల మాదిరే తుస్సుమనిపిస్తుందో చూడాలి.