Ala Vaikunthapurramuloo Sarileru Neekevvaru‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాల తర్వాత త్రివిక్రమ్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర సాంగ్స్‌ పాపులర్‌ అయ్యాయి. కొత్త సంవత్సరం సందర్భంగా సినిమాలోని సూపర్ హిట్ పాట, సామాజవరగమనా పాట వీడియో ప్రోమో విడుదల చేశారు. ఈ లోగా ఒక ఫ్లాష్ న్యూస్ ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తుంది.

ఇప్పటివరకూ జనవరి 12న అనుకుంటున్న ఈ సినిమా ఇప్పుడు 10కి మారబోతుందట. ఇటీవలే సినిమా రఫ్ కాపీ చూసిన బన్నీ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. అయితే 12న విడుదల అంటే అప్పటికే సరిలేరు నీకెవ్వరూ చాలా థియేటర్స్ లో ఉంటుంది కాబట్టి ఓపెనింగ్ సరిపోదని, దానితో తన సినిమాను 10నే విడుదల చెయ్యాలని ప్రణాళికలు రచిస్తున్నారట.

గతంలో సినిమా రిలీజ్ డేట్ల పై వివాదం ఏర్పడినప్పుడు ఇరు చిత్రాల బృందాలు కూర్చుని మాట్లాడుకుని… సరిలేరు నీకెవ్వరూ 11న, అల వైకుంఠపురంలో 12న రావాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు బన్నీ షాక్ ఇస్తున్నాడనే చెప్పుకోవాలి. దీనిపై సరిలేరు నీకెవ్వరూ టీం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

త్రివిక్రమ్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సూపర్ హిట్ కావడంతో అల వైకుంఠపురంలో సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అదే సమయంలో అనిల్ రావిపూడి గత సంక్రాంతి ఎఫ్2 వంటి పెద్ద హిట్ ఇవ్వడంతో ఈ సారి సంక్రాంతికి కూడా అదే రిపీట్ చేస్తాడని ట్రేడ్ లో గట్టి నమ్మకం ఉంది.