cid investigation on inside trading  in amaravati
అమరావతి విషయంలో తెలుగుదేశం పార్టీని ఇరికించడానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుంది. తాజాగా అమరావతిలో భూముల విషయంలో ఈడీని కూడా సంప్రదించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలపై ఈడీకి ఏపీ సీఐడీ నివేదిక ఇచ్చింది. ఇప్పటికే 2 సార్లు సీఐడీ అధికారులతో ఈడీ బృందం మాట్లాడిందని సమాచారం.

అమరావతి భూముల విషయంగా అక్రమాలు జరిగాయని కేబినెట్‌ సబ్‌కమిటీ ఇచ్చిన నివేదికపై ఇప్పటికే ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. రాజధాని ప్రకటనకు ముందే భూములు కొనుగోలు చేసి.. లబ్ధిపొందారని ఆరోపణలు చేస్తుంది అధికార పార్టీ. తెల్లరేషన్‌ కార్డు దారులు కోట్ల రూపాయలతో భూములు ఎలా కొనుగోలు చేశారన్న దానిపై సీఐడీ ఆరా తీస్తోంది.

సుమారు 700 మంది తెల్లరేషన్‌ కార్డు దారులు.. సీఆర్డీఏ పరిధిలో భూములు కొన్నట్లు ఆరోపణ. తెల్లరేషన్‌ కార్డు దారుల వివరాలను ఐటీ, ఈడీకి సీఐడీ పంపింది.అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం తమకు ఈ విషయంగా ఎటువంటి భయం లేదని… చివరికి కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు అవుతుంది అని ధీమాగా ఉంది.

ఈ కేసులలో ఇప్పటికే సీఐడీ పోలీసులు మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణపై కేసులు నమోదు చేశారు. అలాగే బెల్లంకొండ నరసింహారావు అనే స్థానిక టీడీపీ నాయకుడిపై కూడా కేసులు నమోదు చేశారు. మరోవైపు అమరావతిలో భూ అక్రమాలు నిరూపిస్తే రాజధానిని మార్చడం తేలికని ప్రభుత్వం భావిస్తుంది.