వైఎస్సార్ కాంగ్రెస్: ప్లాన్ ఏ వర్క్ అవుట్ కాలేదు కాబట్టి ఇప్పుడు ప్లాన్ బీఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. మాజీ చంద్రబాబు, మాజీమంత్రి నారాయణ పై సీఐడీ పెట్టిన ఎస్సి, ఎస్టీ అట్రాసిటీస్ కేసుని కొట్టివేసింది. ఈ కేసులో స్పష్టమైన ఆధారాలు ఉంటే చూపించాలని సీఐడీని న్యాయమూర్తి కోరగా సీఐడీ తరపు లాయర్ నీళ్లు నమలడం గమనార్హం. ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని న్యాయస్థానం ప్రశ్నించింది.

విచారణ తొలి దశలో వివరాలు చెప్పలేమని సీఐడీ అధికారులు కోర్టు దృష్టికి తెచ్చారు. పూర్తి స్థాయి విచారణకు అనుమతి ఇస్తే అన్ని విషయాలు తెలుస్తాయని సీఐడీ అధికారులు కోర్టుకు తెలిపారు. అయితే ఈ విషయంతో కోర్టు ఏకీభవించలేదు. సీఐడీ విచారణ, సదరు ఎఫ్ఐఆర్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.

ఈ కేసు నిలబడదని మొదటినుండి న్యాయనిపుణులు అంటున్నారు. కేసు ఎఫ్ఐఆర్ స్థాయిలోనే లోపభూయిష్టంగా ఉందని వారి అభిప్రాయం. అయితే చంద్రబాబును సీఐడీ ఎదుటికి తీసుకునిరావాలని లేని పక్షంలో ఎలాగూ చంద్రబాబు వ్యవస్థలను మ్యానేజ్ చేసి స్టే తెచ్చుకున్నాడు అని వాదించే ఆప్షన్ ఎలాగూ ఉంది.

ప్లాన్ ఏ వర్క్ అవుట్ కాలేదు కాబట్టి ఇప్పుడు ప్లాన్ బీ వెళ్తుందా లేక సుప్రీం కోర్టుకు వెళ్లి అప్పుడు ఆ ఆప్షన్ వాడతారా అనేది చూడాలి. ఆ వాదనను ఖండించేలా… ప్రభుత్వం టీడీపీ సభ్యుల కు వ్యతిరేకంగా పాల్పడుతున్న చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో భాగంగానే తాజా కేసు నమోదు చేశారు అనే విషయం టీడీపీ ప్రజల్లోకి వెళ్లేలా చెప్పుకోగలదా అనేది చూడాలి.