చంద్రబాబుని కనీసం ఒక్క రోజు జైలులో పెడితే చాలుఅమరావతిలో ఎస్సి, ఎస్టీ రైతులను మోసగించారంటూ మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి నారాయణ మీద ఎస్సి, ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టింది జగన్ ప్రభుత్వం. ఈ నెల 22న నారాయణను, 23న చంద్రబాబును విచారణకు పిలిచింది సీఐడీ. అలాగే నారాయణకు చెందిన ఇళ్ల మీద ఆఫీసుల మీద ఈ ఉదయం నుండి సిఐడీ సోదాలు చేస్తుంది.

చంద్రబాబు ఇళ్ల మీద కూడా దాడులు జరగొచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ నోటీసులను ఆ పార్టీ వారు సోషల్ మీడియాలో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.కాంగ్రెస్ తో కుమ్మక్కు అయ్యి జగన్ ని పదహారు నెలలు జైలులో పెట్టారు కాబట్టి చంద్రబాబు కు జైలు తప్పదని… కనీసం ఒక్క రోజైన జైలులో పెట్టడం ఖాయమని వారు అంటున్నారు.

ఇప్పటికే ఏ1 అంటూ ఎక్కిరించిన చంద్రబాబుని ఈ కేసులో ఏ1 చేశాం అని వారు బహిరంగంగానే జబ్బలు చరుచుకుంటున్నారు. అయితే ఇలా చెప్పడం ద్వారా ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు అని ఒప్పుకోకనే ఒప్పుకున్నట్టు అయ్యింది. ఇప్పటికే ఆ ఎఫ్ఐఆర్ లోపభూయిష్టంగా ఉందని… కేసు నిలబడదని పలువురు న్యాయనిపుణులు అంటున్నారు.

“అయితే ఈ కేసుని న్యాయస్థానాలు కొట్టేసినా మాకు వచ్చిన నష్టం లేదు. అటువంటి సందర్భంగా లో చంద్రబాబు కోర్టులను మ్యానేజ్ చేశాడు అనే ఇష్యూ ఎలానో ఉంటుంది,” అని వారు బహిరంగంగానే చెప్పుకోవడం గమనార్హం. ఈ పద్మవ్యూహం నుండి చంద్రబాబు ఎలా బయటపడతారో చూడాలి.