YS Jagan Andhra Pradesh Three Capitalsనవ్యఆంధ్ర రాజధానిలో అసైన్డ్‌ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఎస్సి, ఎస్టీ కేసు పెట్టి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం విదితమే. సీఐడీ దాఖలు చేసిన కేసులపై చంద్రబాబు, నారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

ఎఫ్ఐఆర్‌లు రద్దు చేయాలని కోరుతూ పిటిషిన్‌లో కోరారు. మంగళగిరిలో సుమారు‌ 500 ఎకరాల అసైన్డ్ భూములు మోసం జరిగిందని, తాడికొండలో 3 వేల ఎకరాలు ఇలాగే కొట్టేసారన్న అనుమానం ఉందని, వాటిని కూడా విచారించాలని ఈ కేసు వెనుక ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.

దళితులకు అన్యాయం జరిగితే ఏ ఒక్క వ్యక్తి అయిన ప్రశ్నించని, ఆ హక్కుమేరకే తాను కంప్లయింట్ ఇచ్ఛా అని చెప్పారు. చంద్రబాబు తప్పు చేయని వ్యక్తి అయితే బహిరంగగా బయటకొచ్చి మాట్లాడాలని అన్నారు. వ్యవస్థలను మ్యానేజ్ చేయడానికే చంద్రబాబు ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, నారాయణ తప్పు చెయలేదని బావిస్తే విచారణ ఎదుర్కోవచ్చు కదా అంటూ ఆర్కే సూచించారు.

అయితే ఆళ్ల సూచనకు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య గట్టిగానే సమాధానం చెప్పారు. “సిబిఐ కేసుల్లో అరెస్ట్ చేసి చంచలగూడ జైల్లో రిమాండ్ ఖైదీగా పెట్టినప్పుడు, జగన్ గారు బెయిల్ ఎందుకు తెచ్చుకున్నారు? నిజానిజాలు తేలేవరకు, అంటే ఇప్పటివరకు జైల్లోనే ఉండవచ్చు గదా? బయటకు ఎందుకు వచ్చారు? అది అయన ప్రాధమిక హక్కు కనుక. చంద్రబాబుగారు కూడా అదే హక్కుతో కోర్టునాశ్రయించారు. తప్పా?,” అని ఆయన ఎదురు ప్రశ్నించారు.