LV Subramanyamసీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం ను చీఫ్ సెక్రటరీగా తప్పించిన విధానంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. టీటీడీ ప్రక్షాళనకు ఎల్వీ పూనుకోవడమే దీనికి కారణమని క్రిస్టియన్ లాబీ ఒత్తిడి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గట్టిగానే పని చేసిందని, దీనితో ఆయన గతంలో ఎంతో విలువనిచ్చిన ఎల్వీని సాగనంపక తప్పలేదని పుకార్లు షికారు చేస్తున్నాయి.

దీనికి తగ్గట్టుగానే క్రైస్తవ సంఘాలు ఎల్వీ సుబ్రహ్మణ్యం ఊస్టింగ్ ను పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకుంటున్నాయి. ఒక క్రైస్తవ సంస్థ ఏకంగా కేకు కట్ చేసి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టింది. థాంక్యూ సీఎం జగన్ అంటూ ముఖ్యమంత్రి చేసినదానికి మురిసిపోతున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నిజంగానే క్రిస్టియన్ లాబీ ఒత్తిడి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద పని చేసిందా అనే అనుమానాలు మరింత బలపడ్డాయి. ఎల్వీ ఎన్నికల సంఘం చేత ఎన్నికల సమయంలో నియమింపబడి నాటి సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా అతి-ఉత్సాహంగా పని చేశారు. ఆయన ఏ ఉద్దేశంతో అలా వ్యవహరించినా ఎన్నికల వేళ అది వైఎస్సార్ పార్టీకి బాగానే ఉపయోగపడింది.

అందుకుగానూ జగన్ ఆయనను కొనసాగించి, తరచూ అన్నా అంటూ ఆప్యాయంగా పలకరించేవారు. చివరికి… ఆయనను జగన్‌ అవమానకర రీతిలో పదవి నుంచి తప్పించారు. ఆయన షోకాజ్‌ నోటీసు ఇచ్చిన అధికారి చేతే ఎల్వీని ట్రాన్స్ఫర్ చేయించడం విశేషం. ఎల్వీని ప్రాధాన్యత లేని ఏపీ హెచ్చార్దీ కి డైరెక్టర్ జనరల్ గా పంపించారు.