Chiranjeevis-SYE-RAA-NARASIMHA-REDDY-shooting in hyderabadమెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ‘సైరా’ సెట్స్ పైకి వెళ్లే సమయం కోసం మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ప్రారంభించడానికి దర్శక నిర్మాతలు రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఫస్టు షెడ్యూల్ ను హైదరాబాద్ శివారుల్లో ప్లాన్ చేయగా, ఇక్కడ ఆంగ్లేయ సైన్యంతో నరసింహారెడ్డి తలపడే భారీ పోరాట సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఇందు నిమిత్తం విదేశాల నుంచి 200 మంది జూనియర్ ఆర్టిస్టులను రప్పిస్తున్నారు. భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ తోనే భారీ పోరాట సన్నివేశాలను ప్లాన్ చేయడం విశేషం. పోరాట సన్నివేశాలను కొత్తగా డిజైన్ చేయించిన దర్శకుడు సురేందర్ రెడ్డి… తనదైన శైలిలో ఆ సన్నివేశాలను చిత్రీకరించడానికి రెడీ అవుతున్నాడు. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, పలువురు బాలీవుడ్ నటీనటులు ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్న విషయం తెలిసిందే.